మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ,ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి అంజయ్య మాదిగ, హాజరై మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మార్పీఎస్ ఏ పిలుపు ఇచ్చిన తప్పకుండా హాజరై ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య, గౌరవసలహా దారులుగా కుడుముల వీరయ్య పెద్దమాదిగ, సిర్రా శ్రీను,కుడుముల బిక్షం ను మరియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.