పెంచికల పేట్ మండలం లో తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడపీ రోడ్లు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని ఎస్సై,కొమురయ్య అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ జమిల్ హైమత్ తో కలిసి ట్రాక్టర్ యజమానులతో మాట్లాడారు. కేజీవెల్స్ వలన రోడ్లతో పాటు అటవీ ప్రాంతంలో మొక్కలు, చెట్లు కూడా ధ్వంసం అవుతున్నాయని ఆయన అన్నారు. కేజీవీల్స్ కు తప్పకుండా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసుకొవలని, లేనియడల జరిమానా విధిస్తామని, అవసరమైతే ట్రాక్టర్ ను జప్తు చేస్తామని ట్రాక్టర్ యజమానులను హెచ్చరించారు.