వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… సమాజంలో సంచార జాతులుగా ఉండే బంజారాలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారన్నారు. సంత్ సేవాలాల్ జంతు బలి నిషేధాన్ని ప్రచారం చేసిన గొప్ప అహింసా వాదని కలెక్టర్ తెలిపారు. గోవు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాటిని కాపాడే దిశగా కృషి చేసిన మహానీయుడని కలెక్టర్ కొనియాడారు. అనంతపూర్ జిల్లా, గుత్తి మండలంలో జన్మించిన సేవాలాల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో పర్యటించి బంజారాల ఎదుగుదలకు ఎంతగానో కృషిచేసి బంజారాల ఆరాధ్య దైవంగా కీర్తించబడుతున్నారని కలెక్టర్ అన్నారు. కుల,మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తిగా అదేవిధంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జంతుబలి నిషేధం కోసం కృషి చేసిన అహింసవాది అని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేసిన మహోన్నత వ్యక్తి సంత్ సేవాలాల్ అని పేర్కొన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు
లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డిఎండబ్ల్యుఓ కమలాకర్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీనివాస్, లీడ్ బ్యాక్ మేనేజర్ యాదగిరితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.