పిఠాపురం : మహాశిరాత్రికి పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లు అన్ని సిధ్ధం అయ్యాయని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. ఈ సంధర్భంగా బుధవారం సాయంత్రం ఆయన ఆలయ ఆవరణలో పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు మహాశిరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. మహాశివరాత్రికి పాదగయాక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంన్నామని, చంటి పిల్లలకు క్యూలైన్లలో పాలు, మంచినీరు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణం, 25వ తేదీ మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకములు మరియు గ్రామోత్సవం, 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి, 27వ తేదీ గురువారం రథోత్సవం, 28వ తేదీ శుక్రవారం త్రిశూల స్నానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

previous post
next post