కాకినాడ : కాకినాడ పెద్ద మసీదు వద్ద మెయిన్ రోడ్ లో రోడ్ క్రాసింగ్ నిర్వహణకు వీలుగా జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ ను ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం గత నవంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాయగా కార్పోరేషన్ ఇంజనీరింగ్ విభాగం స్పందించి ప్రత్యక్ష పరిశీలన చేసి జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ పనులు చేపట్టలేదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడం వలన మసీదుకు ప్రార్థనల కోసం వచ్చే సీనియర్ సిటిజన్స్ పిల్లలు ట్రాఫిక్ అసౌకర్యంతో రోడ్డు దాటి వెళ్ళలేని ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రమాదాలకు గురవుతూ రోడ్డు మీద పడిపోతూ మోకాళ్లకు దెబ్బలు తగులుతున్న దుస్థితి వుందన్నారు. రంజాన్ మాసం మార్చి 2నుండి ప్రారంభం అవుతున్న దృష్ట్యా సిఎం పేషీ నుండి లభించిన హామీ పరిష్కారం పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.
next post