విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కోదాడకు వచ్చిన సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పెండింగ్లో ఉన్న డి ఏలు, పిఆర్సి, ఆరోగ్య భద్రత పథకం అమలు చేయాలని, విశ్రాంత ఉద్యోగుల సంఘం కు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నివ్వాలని వారి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా మార్చ్ లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే పెన్షనర్ల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలకు రావాల్సిందిగా కోరినారు.ఈ సందర్భంగా స్పందించిన మంత్రి తుమ్మల వీలైనంత తొందరలో పెన్షనర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు. రాంబాబు,కోదాడ అధ్యక్షులు వేనేపల్లి. శ్రీనివాసరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు…..