మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. ఎన్ టీ ఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం , కొనకంచి గ్రామానికి చెందిన గుత్తికొండ చిన్న వెంకటేశ్వర్లు, జ్యోతి దంపతుల కుమారుడు ప్రణవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వారి కుటుంబాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా నిరాధారణకు గురై,ఎవరు లేని అనాధ వృద్ధులకు. అన్నదాన కార్యక్రమం. నిర్వహించడం సంతోషదాయకమన్నారు.ఇలా ప్రతి ఒక్కరు, ఆలోచిస్తే సమాజంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండదని. కార్యక్రమం ఏదైనా సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ ఇలా సేవాగుణంతో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అనాధలకు అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బంధువులు, మిత్రులు,నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

previous post