◆ మహిళా సాధికారితతోనే అభివృధ్ది సాధ్యం
◆ వీరనారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి-OMIF సంస్థ
◆ భూమిక ఉమెన్ కలెక్టివ్ కో ఆర్డినేటర్స్ నాగమ్మ, పద్మ
ప్రతి మహిళ ఆకాశమే హద్దుగా ఎదుగాలని కో ఆర్డినేటర్ నాగమ్మ అన్నారు.
OMIF సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మద్దూర్ మండల కేంద్రం లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం NPRD నారాయణ పేట్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ గారు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ముందడుగు వేయాలన్నారు. ఆనాడు సావిత్రీబాయి పూలే గొప్ప ఆలోచనతో అక్షరజ్ఞానం నేర్చుకున్న ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కుటుంబ బాధ్యతల్లో విభిన్న పాత్రలుపోషించే మహిళలను ప్రోత్సహించాలన్నారు. ఈనాడు కల్పన చావ్లా అంతరిక్ష రోధసిలో పాల్గొని మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతేకాకుండా అట్టడుగువర్గాల కోసం సావిత్రీబాయిపూలే, దుర్గాబాయి దేశ్‌ముఖ్, చాకలి ఐలమ్మ, సరోజనీనాయుడు లాంటి ఎంతో మహిళలు వీరనారీమణులుగా నిలిచారని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రతి మహిళ సాధికారిత సాధిస్తేనే రాష్ట్ర, దేశం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందన్నారు. రాబోయేరోజుల్లో మహిళలు ఉన్నతస్థాయిలో ఉండేలా కృషి చేయాలని ఆమె ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. మహిళలకు ఈ సందర్బంగా ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం లో OMIF మండల కో ఆర్డినేటర్ కృష్ణ,హెల్త్ వర్కర్స్ నాగమణి, లాలమ్మా, స్వాతి, మాధురి, అంజమ్మ పద్మ, భూమిక వాలెంటీర్స్ నరేష్, వివిధ గ్రామాల నుండి 60 మందికి పైగా జోగిని, ఒంటరి మహిళలు పాల్గొన్నారు..