కాకినాడ : విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ అప్ చార్జీల పేరిట చేసిన అధిక వసూళ్లలో ఏర్పడిన మిగులు మొత్తం రూ.1,059 కోట్లు మేరకు ట్రూ డౌన్ ప్రాతిపదికగా ప్రతి నెల కరెంటు బిల్లుల్లో సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. విద్యుత్ టారిఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 2009 నుండి 2024 వరకు ప్రతి నెల అదనంగా వసూలు చేసిన సొమ్మును ట్రాన్స్ కో డిస్కం ల ఖాతాల్లోకి జమ చేయడం కాకుండా విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకు చేర్చాలన్నారు. ఇప్పటికే చిరువ్యాపారులకు సైతం మినహాయింపు లేకుండా కరెంటు వాడకంలో పీక్ అవర్స్ టైమింగ్ తో అదనపు చార్జీలు పెంచడం గృహ వినియోగదారులకు అదనపు కిలోవాట్ వాడకంపై చార్జీలు వుండడం వలన భారాలు అధికంగా ఉన్నాయన్నారు. కరెంటు భారాలు వలన మార్కెట్ వస్తువుల ధరలు ఆహారపు రేట్లు విపరీతంగా పెరుగుతున్న దుస్థితి వుందన్నారు.

previous post
next post