పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్ ఖాళీ చేయాలంటూ కమిషనర్ తెలపడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ స్థలం ఖాళీ చేస్తే మార్కెట్ మీద బతికే వ్యాపారులు జీవనోపాధి కోల్పోతారని మార్కెట్ స్థలం తరలింపు నిలిపివేయాలని వ్యాపారులు కోరారు. అందరికీ అనువుగా ఉండే ఈ ప్రదేశంలోనే మార్కెట్ ను ఉంచాలని కోరారు.

previous post