Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్

  • ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్

 

  • సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం

 

అమరావతి : సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు. ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్‌ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధార్థ్‌ను కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు. దాదాపు అరగంట పాటు అతనితో సీఎం ముచ్చటించారు. వైద్యం రంగంలో సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని, వాటిని సిద్ధార్థ్‌లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు. ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిద్ధార్థ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. అనంతపురానికి చెందిన వీరి కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. సీఎంను కలిసిన వారిలో సిద్ధార్థ్ తండ్రి మహేష్, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు.

Related posts

బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చడం అభినందనీయం

Dr Suneelkumar Yandra

రైతులు అందోళన చెందవద్దు – మాజీ ఎమ్మెల్యే వర్మ

Dr Suneelkumar Yandra

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

TNR NEWS

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

Dr Suneelkumar Yandra

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి