కోదాడ పట్టణంలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 11 సెంటర్లలో 2343 మందికి గాను 2339 మంది హాజరైనట్లు కేవలం నలుగురే గైర్హాజరైనట్లు తెలిపారు. సెంటర్లవారీగా తేజ స్కూల్ 153 మందికి 153 మంది హాజరు, బాలుర ఉన్నత పాఠశాల 234 మందికి 234 మంది హాజరు, శ్రీ చైతన్య శ్రీనగర్ కాలనీ 198 మంది కి 198 మంది సైదయ్య స్కూల్ 231 మందికి 230 మంది, సిటీ సెంట్రల్ 227 మందికి 227, కే టి ఎస్ 240 మందికి 240 మంది, సీసీ రెడ్డి 239 మందికి 239 మంది, ఎస్ఆర్ఎం స్కూల్ 167 మందికి 166 మంది జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ 239 మందికి 238 మంది శ్రీ వైష్ణవి స్కూల్ 240 మందికి 240 మంది హాజరైనట్లు తెలిపారు మొత్తం మీద 99.82 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. *కోదాడ టాలెంట్ స్కూల్ (KTS) పరీక్ష కేంద్రం అడ్రస్సు తప్పుగా ముద్రిoచబడినప్పటికీ విద్యార్థులందరికీ సరైన అవగాహన కల్పించడంతో ఆ సెంటర్లో 100% విద్యార్థులు హాజరయ్యారు.* ప్రతి సెంటర్లో సెట్టింగ్స్ స్వాడ్లను నియమించరన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
