తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఇండ్లమాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇండ్ల మాల్సుర్ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకస్తూపానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగిన భూమి, భుక్తి, విముక్తి పోరాటంలో ఇండ్లమాల్సుర్ నిర్వహించిన పాత్ర మరువలేనిదని అన్నారు. తుపాకి పట్టి దొరలను, భూస్వాములను, జాగీర్దారులను, నిజాం ప్రభుత్వాన్ని గడగడ లాడించిన విప్లవ వీరుడు ఇండ్ల మాల్సుర్ అన్నారు. దళ కమాండర్ గా పనిచేసే మహారాష్ట్ర రాష్ట్రంలోని జాన్నా జైల్లో జైలు జీవితం గడిపారని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ వాయిదా పోరాటానికి మతం రంగు పోస్తుందన్నారు. ఇది ఆనాటి అమరవీరుల త్యాగాలకు ద్రోహం చేసినట్టేనని బిజెపిపై మండిపడ్డారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరి పైన ఉందన్నారు. దేశంలో బిజెపి మతసామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలని చూస్తుందని దాని కుట్రలను లౌకిక వాదులు, ప్రజాస్వామిక వాదులు రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. దేశానికి బిజెపి ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం దాని ఆర్ఎస్ఎస్ భావాజాలం అన్నారు. నమ్మిన హాస్యం కోసం కొట్లాడిన విప్లవ యోధుడు ఇండ్ల మాల్సుర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సిపిఎం గ్రామ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలోసిపిఎం మండలకమటి సభ్యులు గుంట గాని యేసు, చర్లపెల్లి మల్లయ్య, బానోత్ లచ్చి రామ్, ఏలుగు మధు, బానోతూ వేంకన్న, అండెం వెంకటమ్మ,గురువయ్య,గురజాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.