పిఠాపురం : చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ దొడ్డి ప్రసాద్ చోడవరం నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు పెందుర్తి ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ బాబు చేతులమీదుగా సోమవారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైస్సార్సీపీ మద్దతు దారునిగా సర్పంచ్ గా ఎన్నికయ్యానని, అయితే వైస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యలేక పోయామని, ప్రజలకు సేవలు అందించలేకపోయానన్నారు. కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన పార్టీ అధినేత, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పల్లెకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చే విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో జాయిన్ అయ్యామని అయన అన్నారు. జుత్తాడ గ్రామ సర్పంచ్ తో పాటు నాయకులు కర్రి రామకృష్ణ, దొడ్డి రామారావు, బొడ్డేడ నాయుడు, దొడ్డి జాశ్వంత్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లం రామప్పరావు, చప్పగడ్డ శ్రీను, తెలుగుచర్ల మహేష్, నర్వ సరోజ, పోతల అప్పారావు, పీలా మహేష్, ఆడారి మాలినాయిడు, అడ్డూరి శ్రీను, పోలేపల్లి శీను, డోకల మోహన్ తదితరులు పాల్గొన్నారు.