అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు ఐక్యత సోదర భావాలు పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రార్ధనలు నిర్వహించి మాట్లాడారు. రంజాన్ మాసం లో ఆచరించిన ఉపవాస దీక్షల స్ఫూర్తితోనే అందరూ తమ జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలన్నారు. దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం రంజాన్ మాసం అని రంజాన్ మాస దీవెనలు ప్రజలందరికీ కలగాలన్నారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు మతాలకు కులాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందాల నింపాలన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు……
ఈద్గా వద్ద రాజకీయ పక్షాల … రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు..
కోదాడ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలో ఉన్న ముస్లిం సోదరులకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి సిపిఎం తదితర రాజకీయ పక్షాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మహబూబ్ జానీ, ఎర్నేని బాబు,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, బొలిశెట్టి కృష్ణయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు…………