దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు , టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మి నారాయణ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆయాజ్ నగర్ 29,35 నయనగర్ 13వ వార్డులో ఆర్డీవో ఆర్ సూర్యనారాయణ తో కలిసి రేషన్ డీలర్లు రామ్మూర్తి, యోగానందం, అశోక్, రాజేందర్, శ్రీనివాస్ రేషన్ షాపులో లబ్ధిదారులకు సన్నబియాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదలకు పట్టేడు అన్నం పెట్టి కడుపు నింపి ఆకలి తీర్చాలని ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది అన్నారు. సన్న బియ్యం పథకం ప్రవేశ పెట్టేందుకు కృషి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని ప్రారంభించేందుకు హుజూర్నగర్ రావడం ఎంతో గర్వకారణం అన్నారు. ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ రేషన్ డీలర్లు సన్న బియ్యం పథకాన్ని ఎటువంటి అవకతకులు లేకుండా లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, డిటి రామిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, మాజీ సర్పంచ్ పార సీతయ్య, టి పి సి సి ప్రచార కమిటీ కన్వీనర్ కె ఎల్ ఎన్ ప్రసాద్, వార్డు మహిళా నాయకురాలు నాగమల్లేశ్వరి, మాజీ వార్డు సభ్యులు డాక్టర్ బ్రహ్మం, యేసయ్య తదితరులు పాల్గొన్నారు…….
