Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారుడు షేక్ యాకుబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు కోదాడ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. రైతు భరోసా, బోనస్ పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకం అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, పాలూరి సత్యనారాయణ,గుండెల సూర్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…………

Related posts

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

TNR NEWS

మహా ధర్నా నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

Harish Hs

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS