మునగాల మండలం నరసింహులగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి మాతృమూర్తి జూలకంటి అనసూర్యమ్మ మరణం చాలా బాధాకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.ఈ రోజు అనారోగ్యంతో మరణించిన అనసూర్యమ్మ భౌతికకాయంపై పూలమాలవేసి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహులగూడెం గ్రామంలో సిపిఎం నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కొండారెడ్డికి తన తల్లి చేదోడు వాదోడుగా ఉండి సహకారాన్ని అందించేదని అన్నారు. సిపిఎం పార్టీ సానుభూతిపరురాలుగా గ్రామంలో పనిచేస్తూ పార్టీకి బాసటగా నిలబడిందన్నారు. పార్టీ నాయకులుగా, గ్రామ సర్పంచ్ గా తన కుమారుడు పనిచేసిన సందర్భంలో కుటుంబ బాధ్యతలు నడిపి వ్యవసాయంలో తోడుగా నడిచిందని అన్నారు. అనసూయమ్మ మృతికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి షేక్ సైదా బచ్చలకూరి స్వరాజ్యం సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు సిపిఎం అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య స్టాలిన్ రెడ్డి వెంకటాద్రి సోమపంగు నరసయ్య తుమ్మల సతీష్ బోళ్ల కృష్ణారెడ్డి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎస్కే ఖాదర్ సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిలు మారం వెంకటరెడ్డి,మొగిలిచర్ల సీతారాములు,నందిపాటి శేఖర్ నాయకులు పిడమర్తి అబ్రహం,ఉయ్యాల కొండయ్య జూలకంటి కరుణాకర్ రెడ్డి బొంత రవీందర్ రెడ్డి,కోడి సత్యనారాయణ, ఎలుగురీ వెంకన్న,మొగిలిచర్ల రమేష్, సోమపంగు గురవయ్య సోమపంగు ఈదయ్య సోమపంగు రమేష్,నందిపాటి లింగయ్య,పోకల వెంకన్న, మొగిలిచర్ల బిక్షం తదితరులు పాల్గొన్నారు.

previous post