సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మండవ శాంతి కుమార్ మృతి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మండల పరిధిలో కలకోవ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మండవ శాంతి కుమార్ వయసు 35, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆదివారం ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మృతుడి భార్యా ఆరు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడం తో ఒంటరైన కుమార్తె …
అనంతరం అంతిమ యాత్ర లో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి,సైదా, మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, జిల్లా నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు,దేవరం వెంకటరెడ్డి,మండవ వెంకటాద్రి,సురభి వెంకటనారాయణ,అనంతుల గుర్వయ్య, కాంగ్రెస్,బి ఆర్ ఎస్ పార్టీ ల నాయకులు, గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు, అభిమానులు కుటుంబ సభ్యులు, బంధువు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.