సమాజంలో అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా విద్య కై పోరాడిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని డిసిసి ఉపాధ్యక్షులు కోదాడ మాజీ సర్పంచ్ పార సీతయ్య తెలిపారు. సోమవారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇంకా అనేక మంది ముఖ్య అతిథుల చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలూరి సత్యనారాయణ, బాల్ రెడ్డి, సైదా నాయక్, గార్లపాటి వీరారెడ్డి, పంది తిరపయ్య, దండా వీరభద్రం, చలిగంటి లక్ష్మణ్, గంధం యాదగిరి, యాకూబ్, మురళి, వెంకటేష్ శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు……….