Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములను ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములకలపల్లి రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిది అన్నారు.పార్టీ నాయకుడిగా,ప్రజా ప్రతినిధిగా తన భర్త రాములు ఎన్నికై ప్రజాసేవలో ఉన్నప్పుడు ఆమె ఎంతో ఓపికగా ఉంటూ అన్ని విధాలుగా ఆయనకు సహకరించిందన్నారు.ఇంటికి వచ్చే నాయకులకు, కార్యకర్తలను ఆప్యాయతగా పలకరిస్తూ వారికి భోజనాలు పెట్టే వారన్నారు. చనిపోయేంతవరకు పార్టీ సభ్యురాలుగా కొనసాగారని, ఐద్వా,వ్యవసాయ కార్మిక సంఘాలకు సహాయ సహకారాలు అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆరే రామకృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి నందిగామసైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నం హనుమంతరావు

Harish Hs

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS

నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి

Harish Hs

సమర్థవంతంగా సర్వే చేయాలి

Harish Hs

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS