Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు “ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ స్కానింగ్ సెంటర్ల దోపిడి పై చర్యలు తీసుకోవాలని”

సూర్యాపేట జిల్లాలోవరుసగా జరుగుతున్న భృణ హత్యలు ప్రైవేట్ హాస్పటల్లో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బుల కోసం పసి పిల్లలను చంపేస్తున్న హాస్పటల్లో పై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో సోమవారం నాడు నూతన డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ గారికి వినతిపత్రం సమర్పించి ఈ సందర్భంగా పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని ఆడపిల్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు క్రమక్రమేనా ఇలాంటి సంఘటనలు జరిగితే మాతృత్వమే అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు ,అలాగే జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ లపై నిగా ఉంచాలని డాక్టర్ అనుమతి చీటీ లేకుండా మెడికల్ షాప్ వారు అబార్షన్ టాబ్లెట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వంస్పందించి ఆడపిల్లలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని ఇంటికి బంగారం లాగా చూసుకోవాలని జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాను కట్టడి చేయాలని వినతి పత్ర సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ప్రజలకు అన్యాయం జరిగినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని అలాగే ప్రైవేట్ హాస్పటల్ స్కానింగ్ సెంటర్లను,పరిశీలిస్తామని తప్పులు జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు,ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు మేక నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు

TNR NEWS

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

TNR NEWS