పెన్నులు పంపిణీ చేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు మునగాల : ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవాటు చేసుకోవాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు అన్నారు. సోమవారం చేయూత ఆధ్వర్యంలో నిర్వాహకులు గోపి పుట్టినరోజు సందర్భంగా మునగాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు అనాధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన సంపాదించిన దానిలో పేదల కోసం ఎంతో కొంత విచ్చించాలన్నారు. పదిమందికి సాయం చేసినప్పుడే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. కోట్లు సంపాదించిన రాణి తృప్తి పదిమందికి చేసిన సహాయం లోనే లభిస్తుందన్నారు. చేయూత ఆధ్వర్యంలో ప్రతినెల పేదవారికి ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన యువజన సంఘాలు, యూత్ నిర్వాహకులు పేదలకు ఎంతో కొంత సహాయం చేసేందుకు ముందుకు రావాలి అన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చేయూత నిర్వాహకులు గోపి, సతీష్, దిలీప్, రాజ్ కమల్, పవన్, సూర్య, ప్రసన్న, దీపక్, వంశీ, ప్రదీప్, నవీన్, పండు తదితరు పాల్గొన్నారు.

next post