Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పరకాల ఏసిపి సతీష్ బాబు గెలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీస్సా పాఠశాలలో మాదకద్రవ్యాల డ్రగ్స్ నిర్మూలన పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలైన గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపైన లఘు చిత్రం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం ఏసిపి సతీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల కాలంగా యువత దుర్ వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు స్నేహాలు చేయకూడదని డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడిన, అమ్మిన వాడమని ప్రోత్సహించిన వారి వివరాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థి దశలో చక్కటి ప్రణాళిక బద్ధంగా చదువులను కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు క్రమశిక్షణ విద్యార్థుల అవసరమని క్రమశిక్షణతోనే విద్యాభ్యాసం జరగాలన్నారు అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో సీఐ ఆర్ సంతోష్ ఎస్సై తిరుపతి సెయింట్ థెరిస్సా పాఠశాల ప్రిన్సిపల్ జాయిస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

వేసవిలో దాహార్తిని తీర్చడం అభినందనీయం

TNR NEWS

స్థానిక పోరుకు ఎస్‌ఈసీ సై _సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం_

TNR NEWS

విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు

TNR NEWS

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

యువత స్వయంకృషితో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలి

Harish Hs