Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్ని బంద్ చేయించి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని అన్నారు. ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్ని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకులాలు, కస్తూరిబా పాఠశాలలో మరియు ఇతర వసతి గృహాల్లోఫుడ్ పాయిజన్ ఘటనల పై తగు విచారణ నిర్వహించి,బాధ్యులపై చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో పొడుపాయిజన్ ఘటనలు జరగకుండా నివారించాలని అన్నారు.పెండింగ్ మెస్ కాస్మోటిక్ మరియు మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని, కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాలు విడుదల చేయాలని,బెస్ట అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేనియెడల, రానున్న కాలంలో విద్యార్థి ఉద్యమాన్ని బోలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ ,ముస్తఫా, చందు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు

TNR NEWS

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. ఒకే శాఖలో రెండు సర్వీసు రూల్స్ హాస్యాస్పదం.. -బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి..

TNR NEWS