Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని పి హెచ్ సి ని సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆస్పత్రి లో వైద్య సేవలు తీసుకుంటున్న నేపాలు నుండి వలస వచ్చిన భవాని దేవి, మునగాల వాసి వెంకట్రాములు తో మాట్లాడి వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.టి హబ్, ఫార్మసి స్టోర్, లేబర్ రూమ్ పరిశీలించారు. ఎ యన్ ఎం,ఆశ కార్యకర్తలు సీజనల్ వ్యాధులపై అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసూతి సేవలు పెంచేలా వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు..డెంగ్యూ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్యం పనులు చేస్తూ పరిశుభ్రత పాటించాలని డెంగ్యూ వ్యాధి గుర్తిస్తే వారి ఆవాసం నుండి 100 మీటర్ల పరిధిలో శానిటేషన్ చేపించటం జరుగుతుందని తెలిపారు.వనమహోత్సవం లో భాగంగా మునగ మొక్కని నాటి సర్వ రోగ నివారణి మునగ చెట్టు అని మునగ యొక్క లాభాలు తెలిసేలా ఆ చెట్టు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్న మహిళలకి మునగ చాలా ఉపయోగం అని తెలిపారు.

 

పదవతరగతి ఫలితాలు భవిష్యత్ ని నిర్ణయించే మొదటి అడుగు అని బోర్డు పరీక్షలు అంటే భయపడకుండా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని జడ్పీ హెచ్ ఎస్ పదవ తరగతి లో జరుగుతున్న తెలుగు సబ్జెక్ట్ ని విద్యార్థులచే చదివిపించారు అలాగే తెలుగు పదాలు చెప్పి విద్యార్థులతో రాపించారు.మాతృ భాష అయిన తెలుగు భాషపై విద్యార్థులు పట్టు సాధించాలని అలాగే బేసిక్ మ్యాథ్స్ కుడా చేసేలా విద్యార్థులను తయారు చేయాలని ఉపాధ్యాయులకి తెలిపారు. పదవ తరగతిలోనే ఇంటర్ ఎంపీసి చదవాల, బై పి సి చదవాలా, ఇంకా ఏమైనా చదవాలా అని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ఇప్పటినుండే చదవాలని తెలిపారు.విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలని బాగా ప్రాక్టిస్తే చేస్తే పర్ఫెక్ట్ గా సబ్జెక్టు పై అవగాహన ఏర్పడుతుందని అన్నారు.విద్యార్థులకి ప్రాక్టీస్ చేసేందుకు నోట్ బుక్స్, పెన్నులు ఇచ్చారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటినారు.

 

భూ భారతి ఆర్జీలను జిల్లా కలెక్టర్ మునగాల తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్జీలు పరిష్కరణ కొరకు గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి లో పరిశీలించెందుకు రెండు బృందాలు ఏర్పాటు చేసి వేగవంతంగా పరిష్కరించాలని అంతకుముందు ఆర్జిల వారీగా రికార్డులు జతపర్చాలని తెలిపారు.విద్య సంవత్సరం ప్రారంభం అయినందున సర్టిపికెట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని తెలిపారు.రెసిడెన్సీ సర్టిపికెట్ కొరకు ధరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన నేలమర్రి వాసి విద్యార్థి రాహుల్ కి నోట్ బుక్ ఇచ్చారు.

 

జిల్లాలో యూరియా, డి ఎ పి కొరత లేదని సరిపోను నిల్వలు ఉన్నాయని,ఈ వారంలోపు ఇంకా దిగుమతి అవుతుందని యూరియా ఎం ఆర్ పి ధర కే కొనుగోలు చేయాలని రైతులకి సూచించారు. వ్యవసాయ అధికారులు నానో యూరియా పట్ల రైతులకి అవగాహన కల్పిస్తే సాగు ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ అన్నారు.మునగాల మండలంలో 5700 ఎకరాలు లో ప్రత్తి, 760 ఎకరాలులో వరి సాగు చేసారని ఇప్పటికే మొదటి విడత కింద అందరికి యూరియా పంపిణి చేశామని ఇంకా మండలంలో 5200 యూరియా సంచులు ఉన్నాయని ఈ స్టాక్ ఇంకా 20 రోజులకి సరిపోతుందని ఇంకో నాలుగు ఐదు రోజులలో మార్కుఫెడ్ నుండి లోడ్లు వస్తాయని మండల వ్యవసాయ అధికారి కలెక్టర్ కి వివరించారు.

 

ఈ కార్యక్రమం లో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ రామకృష్ణ రెడ్డి, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, మెడికల్ అధికారి రవీందర్,వ్యవసాయ అధికారి రాజు,ఎం ఈ ఓ వెంకటేశ్వర్లు, ఆర్ ఐ లు రామారావు, మంజుల,ఉపాధ్యాయులు విద్యా భవాని, అధికారులు,ఏ ఎన్ ఎం లు,ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

చదువుతోపాటు నైపుణ్యం అవసరం

Harish Hs

సహాయ పరికరాల దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలి నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన చేస్తాం.  ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేర్కోని రాజు డిమాండ్

TNR NEWS

ఘనంగా కార్తీక దీపోత్సవం

TNR NEWS

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TNR NEWS

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS