కుటుంబంలో తల్లిని తల్లిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటదని పలువురు బిజెపి నాయకులు అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో బూత్ అధ్యక్షులు సురేంద్ర బాబు అమ్మ హుస్సేనమ్మ ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయినారు ఆదివారం ఆమె దశదినకర్మలో పలువురు బిజెపి నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ బిజెపి పార్టీ బూత్ అధ్యక్షులు తల్లి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబానికి బిజెపి పార్టీ ఎప్పుడు అండగా ఉంటాదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరగని రాధాకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు, మల్లెబోయిన వెంకటేష్ బాబు, స్థానిక బిజెపి నాయకులు ఏసుబాబు, పున్నారావు, శివ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post