యువత ఉపాధి కోసం వ్యాపారంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీర వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ గీత మాడ్యులర్ ఇంటీరియర్ డిజైన్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ రమావత్ సిద్దు సైదులు ఇంటీరియర్ రంగంలో శిక్షణ తీసుకొని వారు సొంతంగా యూనిట్ ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. స్థానిక ప్రజలు చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉండటం వలన అనేక వ్యాపార సంస్థలు ఇక్కడ తమ షోరూంలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, పార్టీ నాయకులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, పందిరి మల్లేష్, సత్యనారాయణ రెడ్డి, సాయి నేత, రమేష్ గద్దల శిరీష, బొజ్జ సంజయ్, సాజిద్ నిర్వాహకులు రమావత్ సైదులు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

previous post