జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా ఉండాలి. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు. బెట్టింగ్ యాప్స్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి అని మరియు మన భారతదేశం ను డ్రగ్స్ లేని సమాజంగా మనమంతా కలిసి నిర్మిద్దాం. మీ దృష్టికి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తే వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి లేదంటే డయల్ తెలంగాణ పోలీస్ 112 కాల్ చేసి సమాచారాన్ని తెలపండి. అలాగే మిలటరీ జాబ్స్ కి తెలంగాణ స్టేట్ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మా సైనిక గ్రూప్ అండగా ఉంటుంది అని జగిత్యాల ఇంచార్జ్ పంచతి బాలరాజు తెలిపారు.ఈ సదస్సును పురస్కరించుకొని ఇటీవలే ఆర్మీ నుండి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారి భూపతిపూర్ గ్రామానికి చెందిన నూకల మల్లేశం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుపతి,మాజీ సైనిక అధికారి నూకలమల్లేష్ అభినందిoచరు