మునగాల మండల పరిధిలోని నారాయణగూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దేవి ఆలయంలో నిర్మించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ, శివలింగం, నంది, వినాయకుడి విగ్రహాలకు శుక్రవారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సోమిరెడ్డి వీరారెడ్డి బాబు రూ1.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని నారాయణ గౌడ సంఘం నాయకులు తెలియజేశారు.