స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న బీసీల ఉద్యమానికి సకలజనులు సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు
సోమవారం నాడు ఆయన కోదాడలోని బీసీ హక్కుల సాధన సమితి కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ….
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే సకల జనులు ఐక్యమై ప్రపంచం నివ్వేర పోయేలా సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీలు న్యాయమైన రాజకీయ వాటా కోసం చేస్తున్న ఈ పోరాటo లో కూడా సకలజనులు మద్దతి ఇచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాలని, ముఖ్యంగా ఎస్టీలు, ఎస్టీలు ఉద్యమానికి వెన్నుముకగా నిలిచి ముందుకు నడిపించాలని బీసీలు చేసిన ఉద్యమానికి మందకృష్ణ మాదిగ తన సంపూర్ణ మద్దతు ఇప్పటికే ప్రకటించి ఉన్నారని అలాగే గిరిజనలు కూడా ఉద్యమానికి ఊతమివ్వాలని, బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో అడ్డంకిగామారిన విషయాన్ని సకల జనులు గమనించాలని ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు సంసిద్ధం కావాలని ఆయన ఉద్భోదించారు.
చిత్తశుద్ధితో ప్రజలు ఏ ఉద్యమం చేసినా ఇంతవరకు అపజయం పొందలేదని ఇది చరిత్ర చెబుతున్న సత్యమని, బీసీ ఉద్యమాల్ని అడ్డం పెట్టుకొని ఎన్నో పదవులు అనుభవించిన వారు ఇప్పుడు అధికార పార్టీలో చేరి బీసీల పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేయలేక కేవలం పత్రిక ప్రకటనలకు పరిమితమైన వారికి బీసీలు తగు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు
సమావేశానికి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య అధ్యక్షత వహించగా… ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలక రాజు శ్రీను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇనుగుర్తి వెంకటరమణాచారి జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పతల శ్రీనివాస్ యువజన విభాగం నాయకులు పరికే భరత్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే లతీఫ్ మహిళా విభాగం నాయకురాలు సావిత్రి విజయ పాల్గొన్నారు