తాడేపల్లిగూడెం : ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల, ఆలీషా అకాడమీ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో ఆగస్టు 1 నుండి 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 1 నుండి 6 వరకు అనేక అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు ‘‘తల్లిపాలకు ప్రాధాన్యత : ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు హామీ’’ అనే ప్రభావవంతమైన అంశంను పురస్కరించుకొని, శిశువులు మరియు తల్లులు ఇద్దరికీ తల్లిపాలతో కలిగే అపారమైన ప్రయోజనాల పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత ఆరు రోజులుగా ఆగస్టు 1 నుండి ఆగస్టు 6వ తేదీ వరకు, విద్యార్థులు, అధ్యాపకులు బృందాలుగా ఏర్పడి తాడేపల్లిగూడెం సమీపంలోని గ్రామాలలో ప్రజలు, గర్భిణులు మరియు పాలిచ్చే తల్లులకు వివిధ గ్రామాల్లో అనేక అవగాహనా కార్యక్రమములు, వైద్య శిబిరములు మరియు కళాశాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తల్లిపాలు శిశువులకు సంపూర్ణ పోషణను అందించడంతో పాటు, జలుబు, జ్వరం, విరోచనాలు వంటి సాధారణ వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని పెంచి రక్షణ కల్పిస్తాయని, జీర్ణక్రియకు సహాయపడతాయని, మేధో వికాసాన్ని ప్రోత్సహిస్తాయని, అలెర్జీలు మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయన్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలను ఉపయోగపడతాయని, మరియు తల్లి-బిడ్డల మధ్య కీలకమైన అనుబంధాన్ని బలో పేతం చేస్తాయని అన్నారు. అదే విధంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ప్రారంభోత్సవం సంధర్భంగా తల్లిపాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించి, అనంతరం బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. స్థానిక సత్యవతినగర్‌లో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కరిబండి రామకృష్ణ సహకారంతో తల్లిపాల పై ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
- నవాబుపాలెంలో ఉచిత హోమియోపతిక్ వైద్య శిబిరం మరియు తల్లిపాల పై అవగాహన
తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో తల్లిపాల పై అవగాహన కార్యక్రమము నిర్వహించి, ఉచిత హోమియోపతి వైద్యం ద్వారా 97 మంది రోగులకు ఉచితముగా మందులు పంపిణి చేయడం జరిగిందని ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో తొమ్మిది మంది అధ్యాపకులు మరియు ఇరవై రెండు మంది ఇంటర్న్‌ర్లు చురుకుగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమానికి నవాబుపాలెం గ్రామ సర్పంచ్ ముద్దుకూరి గంగా భవాని మరియు ముద్దుకూరి ధనరాజు హాజరయ్యారు. ప్రొఫెసర్ డాక్టర్ సానపల ఆనందరావు, వైస్ ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ డి.సురేంద్ర కుమార్, ఇతర అధ్యాపకులు మరియు ఇంటర్న్‌ర్లు కూడా పాల్గొన్నారు.
- ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాలలో కూడా తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ ప్రతికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ డి.సురేంద్ర కుమార్, అధ్యాపకులు ప్రొఫెసర్ డాక్టర్ సనపల ఆనందరావు ఇతర అధ్యాపకులు, వైద్యులు, జూనియర్ డాక్టర్లు మరియు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.