కోదాడ సబ్ డివిజన్ షీ టీం ఎస్సైగా మల్లేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో కోదాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేసిన ఆయన ఇటీవల సూర్యాపేట వీఆర్ కు బదిలీ అయ్యారు.అక్కడి నుంచి సోమవారం కోదాడ సబ్ డివిజన్ షీ టీం ఎస్సైగా బదిలీపై వచ్చారు.కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఎస్సై మల్లేష్ తెలిపారు.