Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 902 ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము సోమవారం జీవో జారీ చేసింది.ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నడిగూడెం మండల కేంద్రవాసి అయిన ఏపూరి తిరుపమ్మ సుధీర్,వైస్ చైర్మన్ గా షేక్ బషీర్ తో పాటు 16 మంది డైరెక్టర్లతో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలిబడ్డాయి.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏపూరి తిరుపమ్మ సుదీర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి,పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా,వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తిగా శక్తివంచన లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.

Related posts

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

TNR NEWS

రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత…..  రహదారి భద్రత నిబంధనలు పాటించండి ఆనందంగా జీవించండి……… టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్….. కోదాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభం

TNR NEWS

టీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs