హైదరాబాద్ కూకట్ పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తన్నీరు శ్రీకాంత్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు కోదాడ కోర్టులో నాయవాదులు తమ విధులు బహిష్కరించి,నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా *ఉయ్యాల నర్సయ్య అధ్యక్షతన* జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ *ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ* మాట్లాడుతూ కూకట్ పల్లి కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది ఒక సివిల్ దావాలో గెలిచి E.P వేసి J.Dr లను ఇల్లు ఖాళీ చేయించడానికి,కోర్టు ఆర్డర్ ను అమలు చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న J.Drs వారి మనుషులు,రౌడీలను వేసుకొని కోర్టు బెలీఫ్ ,D.Hr మరియు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ పైన అందరిపైన దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ చర్య న్యాయవాదులకు,న్యాయవ్యవస్థ కు మచ్చ అన్నారు.
శ్రీకాంత్ పై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇలాంటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని,వెంటనే *అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్* ను తేవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని,న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, గచ్చిబౌలి లో కోర్టు ఆదేశాలను అమలు జరపడానికి వెళ్ళిన కూకట్ పల్లి కోర్టు న్యాయవాది టి. శ్రీకాంత్ పై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు కోదాడ కోర్టులో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు యడ్లపల్లి వెంకటేశ్వరావు,కోడూరు వెంకటేశ్వరరావు,బండారు రమేష్ బాబు, కరీం,హుస్సేన్, చలం,నవీన్,కానుగు మురళి, సీనియర్ న్యాయవాదులు వై.సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, రంజాన్ పాషా,రంగారావు,శరత్ బాబు,ఈదుల కృష్ణయ్య,గట్ల నర్సింహారావు,mvs శాస్ట్రీ, Ch. రామిరెడ్డి,యశ్వంత్ రామారావు, బెల్లంకొండ గోవర్ధన్,హేమలత, శ్రీధర్,పాషా,బాలయ్య,రియాజ్,తాటి మురళి,మంద వెంకటేశ్వర్లు,శరత్,మల్లిఖార్జున్, భీమయ్య, సంధ్య,శిల్ప తదితరులు పాల్గొన్నారు.