సోమవారం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఆశ యూనియన్ పిలుపు ఉన్నదని
ఇంట్లో ఉన్న ఆశాలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని BRTU జిల్లా అధ్యక్షులు ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి. గురూజీ ప్రభుత్వం ను విమర్శించారు.
వెట్టి చాకిరీ చేస్తున్న ఆశాల పై కనీసం కనికరం లేకుండా మహిళలు అని చూడ అరెస్ట్ చేయడం ఏమిటని అన్నారు. ఆశాలు గొంతేమ్మ కోర్కెలు ఏమి కోరడం లేదని ఫిక్సడ్ వేతనం 2O,0OO/-ఇరవై వేలు ఇవ్వాలని, ప్రమాద భీమా, ఇన్సూరెన్స్ 50లక్ష లు ఇవ్వాలని, అర్హులైన వారిని ANM లు అవకాశం కల్పించాలని రిటైర్ మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇచ్చి వారి కుటుంబం లో ఒకరి కి అవకాశం కల్పించాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 30,000/- ఇవ్వాలని, ఆశాల పై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కు వెంటనే వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని లేనిచో రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వం ను హెచ్చరించారు. అనంతరం అరెస్ట్ చేసి సొంత పూచి కత్తు పై విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో ఆశా యూనియన్ పట్టణ అధ్యక్షురాలు సక్కుబాయి, యూనియన్ నాయకులు బైనా బాయి, నాగలక్ష్మి, నవ్య, మరియమ్మ, వెంకటరమణ, తులిషమ్మ,ఉమా, శైలజ,పర్విన్, నాగ పూర్ణిమ,జ్యోతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.