భారతరత్న పురస్కార గ్రహీత కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ 136 జయంతి వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ ఈ వేడుకలలో పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పలుమార్పులు తెచ్చిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆజాద్ను వారు చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఒక రచయితగా, కవిగా ,ఉద్యమ నేతగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించారని ఆజాద్ మైనారిటీ అభ్యున్నతికి చేసిన సేవలను ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. అనంతరం మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహించిన వకృత్వం, వ్యాసరచన, పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు షిల్డ్ లు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, డిడబ్ల్యూఎంఓ జగదీశ్ రెడ్డి, డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఓ వి అప్పారావు, డిఎం అండ్ హెచ్ ఓ కోటాచలం, డిఈఓ అశోక్, సిపిఓ ఎల్ కిషన్, డి జి డి వో శంకర్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి సి ఓ పద్మజ ,ఎస్సీ అభివృద్ధి అధికారి లత ,పశుసంవర్దక అధికారి శ్రీనివాస్ ,పరిశ్రమల శాఖ అధికారి సీతారాం నాయక్ ,పిడిఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, మిషన్ భగీరథ ఇంజనీర్ శ్రీనివాస్, బి డబ్ల్యు నరసింహారావు, మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బుడా సాహెబ్ సెక్రటరీ షేక్ జాఫర్ సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
————Dpro………..Srpt———