కామారెడ్డి జిల్లా బిచ్కుంద విద్యార్థులు ఆట పోటీలు తోపాటు నిత్య వ్యాయామం ద్వారా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మహిళలకి ఉత్తేజాన్ని కల్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఆదర్శం అని బిచ్కుంద మండలం కేద్రం లో మంగళవారం ఏర్పాటుచేసిన ఏబీవీపీ ఆటపోటీలలో బిచ్కుంద సీఐ జగడం నరేష్ అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హై స్కూల్ మరియు కళాశాల స్థాయిలో ఆట పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జగడం నరేష్ మాట్లాడుతూ దేశం పట్ల ప్రేమ, సాహసం, ఎదిరించే ధైర్యం, తాను ఉన్నన్ని రోజులు నా ఝాన్సీ ని ఎవరి చేతిలో పెట్టనని,హుంకరించినావీరనారి ఝాన్సీ రాణి అని కొనియాడుతూ, మనం ఆమెని ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటు, ఆట పోటీలలో కూడా ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, మాట్లాడుతూ చిన్నప్పటి నుండి కూడా దేశానికి సమర్పితం కావాలనేటటువంటి లక్ష్యం మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో లెక్చరర్ శంకర్, శివకుమార్, ఏబీవీపీ నాయకులు ముప్పిడి వెంకట్, గాల్మే విటల్, మెత్రి హనుమాన్లు, నగర కార్యదర్శి సందీప్, మహిళా కన్వీనర్ సంతోష్ రాణి, గణేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన గౌరవ వందనాన్ని బిచ్కుంద సీఐ స్వీకరించారు. ఎస్ ఎస్ బి ఎస్ విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆట పోటీలలో మద్నూర్ బిచ్కుంద మండలాల్లోని పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.