భారతదేశం లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగే వంద సంవత్సరాల వేడుకలను వాడ వాడలా నిర్వహించి కమ్యూనిస్టు ల ఘనతను ప్రజలకు వివరించాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ రోజు గరిడేపల్లి మండలం లోని కొండాయిగూడెం గ్రామం లో జరిగిన గ్రామ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ, భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యము కావాలని బ్రిటిష్ వాళ్ళను మొదటి గా డిమాండ్ చేసి పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, భారత దేశ స్వాతంత్య్ర పోరాటం తో పాటు, స్వాతంత్ర అనంతరం కూడా ప్రజల ప్రక్షాన అనేక పోరాటాలు నిర్వహించి,నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అధికారం కోసం కాక ప్రజల కోసం పనిచేసి, పేద ప్రజలకు, కార్మికులకు అనుకూలంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి చట్ట సభలలో అనేక చట్టాలను చేయించిన ఘనత సిపిఐ పార్టీ దని అని ఆయన అన్నారు.
. ఈ సమావేశానికి సిపిఐ సీనియర్ నాయకులు అంబటి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, కుందూరు వెంకటరెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు కేతిరెడ్డి సంజీవరెడ్డి, బందు రామయ్య,కర్నె సైదిరెడ్డి, మాతంగి ప్రకాశం, మాతంగి వెంకన్న, దానేలు, యర్ర వెంకన్న,దైద యేసుపాదం, పర్సగాని వెంకన్న,పొట్టబత్తిన వెంకటేశ్వర్లు, అంబటి గోవిందరెడ్డి, ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.