సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్యుమరేటర్లకు వారు అడిగిన దానికి సరైన సమాచారం ఇచ్చి సర్వే విజయవంతానికి కృషి చేయాలి అని మున్సిపల్ కమీషనర్ బి. శ్రీనివాస్ అన్నారు.మంగళ వారం రోజున పట్టణంలో ని వివిధ వార్డు లలో సర్వే జరుగుతున్న తీరని పరిశీలించారు.మీ ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఆధార్, రేషన్ కార్డ్, పట్టాదార్ పాస్ బుక్ నెంబర్లు తెలపాలన్నారు. ఎవరు కూడా ఎటువంటి జిరాక్స్ కాపీలు ఇవ్వనవసరం లేదు అని అడిగిన సమాచారం తెలియజేస్తే సరిపోతుందిఅన్నారు సర్వేలో భాగంగా మీ ఇంటి ముందు స్టిక్కర్ వేయకుంటే లేదా స్టిక్కర్ వేసే సమయంలో మీరు అందుబాటులో లేకుంటే సంబంధిత వార్డ్ ఆఫీసర్ కు తెలియజేస్తే వారు ఎంట్రీ చేయించునన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ సత్య రావు, డీలింగ్ అసిస్టెంట్ గోపారపు. రాజు,ఏం.డీ. గౌస్ ఉద్దీన్, ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్ ,ఇ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
previous post