Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

దేశంలో,రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో దాడి చేసిన సంఘటనకు నిరసనగా బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం వారి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. న్యాయవాదుల రక్షణకు సమగ్ర చట్టం రూపొందించి, దానిని అమలు చేయాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వర రావు, హేమలత, దొడ్డ శ్రీధర్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Related posts

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట   వాగులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం తీసిన పోలీసులు

TNR NEWS

చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ

TNR NEWS

కోదాడ లో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS

మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమే….  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ పై అవగాహన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

TNR NEWS