విద్యార్థి దశలోనే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలో నేర ప్రవుత్తిని తగ్గించేందుకు కృషి చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల కార్మిక చట్టం, విద్యా హక్కు చట్టం, యితర చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చట్టాలు, న్యాయ సూత్రాల తెలుసుకొని భవిష్యత్తు లో మంచి పౌరులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు దుర్వసనాల బారిన పడకుండా చదువు పై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, ఎం ఈ వో సలీం షరీఫ్, న్యాయవాదులు మంద వెంకటేశ్వర్లు, సెగ్గెం వెంకటాచలం, దొడ్డ శ్రీధర్, తాటి మురళీ, హేమలత, బండి వీరభద్రమ్, ఆవుల మల్లికార్జున రావు, సుల్తాన్ నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు మార్కండేయ, బడుగుల సైదులు తదితరులు పాల్గొన్నారు.