Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

చేవెళ్ల :

పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం బాకాపూర్ గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ (27) తండ్రి అంజయ్య 2017 లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బుధవారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టులో నేరం రుజువైంది. దీంతో అతడికి అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఆ కోర్టు న్యాయమూర్తి హరీశ తీర్పునిచ్చినట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు స్పెషల్‌ పీపీలుగా కుమలత, నరేష్ , ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్లుగా టీ స్వామి, శృతి కీర్తి, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌గా బీ జంగయ్య, బ్రీఫింగ్ ఆఫీసర్లు గా యన్ పంకజ్ వసీ, బీ అలివేలు వసీ, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, పీసీలు ఆర్ దయాకర్ రెడ్డి, జీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

TNR NEWS

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

Harish Hs

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

డబ్బా కోట్లు తొలగించవద్దంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన

Harish Hs

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

Harish Hs