November 7, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

కాకతీయ కమ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు కమ్మ కులస్తులు విద్యా ఉద్యోగ ఉపాధి వాణిజ్య వర్తక రాజకీయ రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో కమ్మ కులస్తుల కార్తీక మాస వన భోజన మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికతకు ఐక్యతకు ప్రతీకలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కమ్మ కులస్తులు భాగస్వాములై సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పూర్వికులు సమాజ చైతన్యానికి కృషి చేశారని నేటితరం కమ్మ కులస్తులు కూడా అదే ఆదర్శభావాలను కొనసాగించాలన్నారు. పేద విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఉన్నత స్థానాల్లో ఉన్న కమ్మ కులస్తులు సహకారం అందించాలని కోరారు మంచి కోసం జరిగే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు ను ఘనంగా సన్మానించారు కాగా కమ్మ కులస్తుల వనభోజనానికి మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కమ్మ కులస్తులు హాజరై విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Related posts

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS

మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ

TNR NEWS

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS