Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శబరినగర్ లో అన్ని మాలధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న దానం కార్యక్రమాన్ని సూర్యాపేట డిఎస్పి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించే అయ్యప్ప స్వాములకు శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఎటువంటి దానం చేసినా పుణ్యం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త సేవాసమితి సభ్యులు యర్రంశెట్టి ఉపేందర్, వెంపటి పురుషోత్తం, అంతటి విజయ్, తోట నర్సయ్య, రాచకొండ కృష్ణ, గొట్టిపర్తి శ్రీకాంత్, ప్రకాష్, దేసోజు నాని తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ ఆందోల్‌లోని పలు విద్యా సంస్థల్లో పర్యటించిన మంత్రి దామోదర

TNR NEWS

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

“ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

TNR NEWS