Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

 

సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత సాధించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంతమొందించాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మి బడుగు బలహీన వర్గాల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు పూలే అని వారి సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గుండెల సూర్యనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు,పాలూరి సత్యనారాయణ, బాగ్దాద్,వీరారెడ్డి, అశోక్,ఆలేటి సత్యనారాయణ, నెమ్మది దేవమని, శంకర్,సంజీవ్,బాబా తదితరులు పాల్గొన్నారు…………

Related posts

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా

TNR NEWS

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

TNR NEWS

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS