Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బి ఆర్ ఎస్. పార్టీలో చేరిక*

మహబూబాబాద్ జిల్లా, గూడూరు పట్టణ కేంద్రానికి చెందిన తండా శ్రీహరి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, మహబూబాబాద్ లో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో, విఫలమైందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో కష్టపడాలని, వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, పట్టణ అధ్యక్షులు చీదురు వెంకన్న, సీనియర్ నాయకులు కటార్ సింగ్, మండల మాజి కో ఆప్షన్ సభ్యులు ఎండి. రహీం పాషా, బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి భూక్య సురేష్ నాయక్, గూడూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య, సంపంగి రాములు, బొంతు రాములు, సొసైటీ డైరెక్టర్. ఎడ్లరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం – పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

TNR NEWS

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి. డాక్టర్ స్పందిస్తే మా బాబు బతుకుతుండే. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.

TNR NEWS

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

కరాటే పోటీల్లో బెజ్జంకి విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs