దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంఈఓ కనకరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని అన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘం సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది మమత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు….