అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు సోమవారం శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. స్థానిక శివాలయంలో గురుస్వామి చేత మిగతా స్వాములు ఇరుముడిని కట్టించుకున్నారు. అనంతరం సన్నిధానంలో పడి పూజను నిర్వహించారు. భక్తులు అయ్యప్పస్వాములు పాద పూజ చేసుకున్నారు. అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో శబరిమలకు బయలుదేరారు. స్వాములు శబరి యాత్ర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.