Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

నిమోనియ బారినపడి బాలుడు మృతి

నిమోనియా బారిన పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని దాతర్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జూపల్లి బాలయ్య, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ధనుష్ (8) అనే బాలుడు గత పది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుణ్ణి మొదటగా గజ్వేల్ పట్టణంలోని ఏబీసీ ఆసుపత్రిలో, అనంతరం రెయిన్బో ఆసుపత్రిలో చూపించగా నిమోనియా తగ్గకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. కాగా బాలుడు గజ్వేల్ పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.

Related posts

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి డిఎస్పి బదిలీ. వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs